కర్నూల్: కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో గురువారం నాడు పరువు హత్య చేసుకొంది.  బైక్ పై వెళ్తున్న  ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు.

బైకుపై వెళ్తున్న అతడిని అడ్డుకొని బండరాయితో కొట్టి చంపారు. నెల రోజుల క్రితం ఆడమ్ స్మిత్  మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. తన కుటుంబ సభ్యులే తన భర్తను హత్య చేశాడని మహేశ్వరీ ఆరోపించారు.

మృతుడు ఆడమ్ స్మిత్ ఫిజియోథెరపి వైద్యుడిగా పనిచేస్తున్నారు.  వీరిద్దరి ప్రేమ వివాహనికి మహేశ్వరీ కుటుంబం ఒప్పుకోలేదని  మహేశ్వరీ ఆరోపిస్తోంది.గత నెల 12వ తేదీన ఆడమ్ స్మిత్ మహేశ్వరీని పెళ్లి చేసుకొన్నాడు. వీరిద్దరివి వేర్వేరు కులాలు. 

నందవరం మండలం గురజాలకు చెందిన .ఆడమ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మహేశ్వరి కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో గత నెల 12 వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు.

ఆదోనిలోని ఓ నర్సింగ్ హోంలో ఆడమ్ స్మిత్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పెళ్లి తర్వాత ఆదోనిలోని సిద్దా కిష్టప్ప కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని బైకుపై స్మిత్ ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు బైక్ ను అడ్డగించి బండరాయితో మోది ఆడమ్ స్మిత్ ను చంపారు. 

సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడిందెవరో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.మృతుడి స్వగ్రామం గురజాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు.