కర్నూలు జిల్లాలో యువకులను ట్రాప్‌లో వేస్తున్న కిలాడీ లేడీ.. ఎదురు తిరిగినవారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతుంది. అయితే  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

కర్నూలు జిల్లాలో హనీట్రాప్ వ్యవహారం వెలుగుచూసింది. యువకులను ట్రాప్‌లో వేస్తున్న కిలాడీ లేడీ.. ఎదురు తిరిగినవారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతుంది. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఓ మహిళ చాటింగ్, వీడియో కాల్స్‌ ద్వారా యువకులతో పరిచయం పెంచుకుంటుంది. తన స్వీట్ వాయిస్‌తో యువకులను ఆకర్షించి వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటుంది. తర్వాత తీసుకున్న అప్పు చెల్లించమంటే బెదిరింపులకు పాల్పడుతుంది. 

రికార్డు చేసిన వీడియోలను యువకుల స్నేహితులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతుంది. ఎదురు తిరిగిన వారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు దిగుతుంది. ఈ క్రమంలోనే కిలాడీ లేడీ బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు కూడా కిలాడీ లేడీ ట్రాప్‌లో పడినట్టుగా తెలుస్తోంది.