ఎంఎల్ఏపై తేనెటీగల దాడి

First Published 19, Dec 2017, 4:57 PM IST
Honey bees attacked tdp MLA
Highlights
  • టిడిపి ఎంఎల్ఏ పై తేనెటీగలు పగబట్టినట్లున్నాయి.

టిడిపి ఎంఎల్ఏ పై తేనెటీగలు పగబట్టినట్లున్నాయి. లేకపోతే అందరి మధ్యలో ఉన్నప్పటికీ ఎంఎల్ఏపైన మాత్రమే ఎందుకు దాడి చేస్తాయి? చుట్టుపక్కలున్న వాళ్ళకి మళ్ళీ ఏమీ కాలేదు. ఎవరిపైనా ఈగలు దాడి చేయలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎంఎల్ఏ బోడెప్రసాద్ మంగళవారం ఆత్మగౌరవ సభ దీక్షలో పాల్గొన్నారు. కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లులో ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో పాటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈడ్పుగల్లు హైస్కూలు నుండి ప్రారంభమైన ర్యాలీ మీటింగ్ జరిగే స్ధలానికి చేరుకోవాలి.

వేదిక వద్దకు ర్యాలీ చేరుకుంటోంది అనగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్లపైనుండి తేనెటీగలు దాడిచేసాయి. తేనెటీగల గుంపును చూసి అందరూ నివ్వెరపోయారు. అందులోనూ అన్నీ నేరుగా ఎంఎల్ఏపైనే దాడి చేయటంతో భద్రతా సిబ్బందితో పాటు కార్యకర్తలకు కూడా ఏం చేయాలో దిక్కుతోచలేదు. తేనెటీగల్లో ఒకటి, రెండు ఎంఎల్ఏ చొక్కాలోకి దూరిపోయి గాయపరిచాయి. దాంతో ఎంఎల్ఏ చొక్కాను విప్పేసి తేనెటీగలను బలవంతంగా లాగి అవతల పాడేసారు. అయితే ఎలా వచ్చాయో అలానే తేనెటీగలంతా వెళ్లిపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

loader