పరుగులు తీసిన కార్యకర్తలు
జగన్ పాదయాత్రలో అనుకోని సంఘటన జరిగింది. ఈ ఘటన కారణంగా.. కార్యకర్తలు పాదయాత్ర నుంచి పరుగులు తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఈ క్రమంలోఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కొద్ది సేపటి తర్వాత.. తిరిగి పాదయాత్రను కొనసాగించారు.
