చిత్తూరు: ఆంద్రప్రదేశ్ కు నూతనంగా నియమితులైన బిబి హరిచందన్ చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బిశ్వ భూషణ్ హరిచందన్ కు జిల్లా అధికార యంత్రాంగం ఘనస్వాగతం పలికింది. 

మంగళవారం ఉదయం 11.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తలతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు.  

అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు. శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్శించుకోనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట వియానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.  

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిబి హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే గవర్నర్ రాకకోసం రాజ్ భవన్ ను సైతం సిద్ధం చేసింది ఏపీ సర్కార్.