విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జరుగుతున్న రాజకీయ దాడులపై స్పందించిన ఆమె రాజకీయ దాడులు సరికాదన్నారు. 

రాజకీయ దాడులకు పాల్పడటం సరికాదని అలాంటి వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా హోంశాఖమంత్రి సుచరితను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా పోలీసుల సంక్షేమంపై చర్చించారు. పోలీసుల సంక్షేమానికి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలీసులకు పనిభారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సుచరిత స్పష్టం చేశారు.