Asianet News TeluguAsianet News Telugu

అటు అన్నా, ఇటు చెల్లి: కడప రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి?

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో  కడప జిల్లా రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే  విషయమై  ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. 

 History of Y.S.Rajasekhara reddy Family Politics in Kadapa District lns
Author
First Published Jan 30, 2024, 4:35 PM IST | Last Updated Jan 30, 2024, 4:37 PM IST


కడప: దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  కూతురు  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో  చేరడంతో కడప రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోననే చర్చ  తెరమీదికి వచ్చింది. ఈ నెల  4వ తేదీన వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అదే రోజున తన పార్టీ యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ( వైఎస్ఆర్‌టీపీ)ని  షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలిగా  ఎఐసీసీ  నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా వై.ఎస్. షర్మిల పర్యటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కడప జిల్లా నుండే షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో  1978 నుండి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులే  ఈ స్థానం నుండి విజయం సాధిస్తున్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  తనయుడు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)ని ఏర్పాటు చేసుకున్నారు.  వైఎస్ఆర్ కూతురు వై.ఎస్. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  తొలిసారిగా అన్నా చెల్లెలు వేర్వేరు పార్టీలో ఉన్నారు. దీంతో  రానున్న ఎన్నికలు  కడప జిల్లాలో  రసవత్తరంగా సాగనున్నాయి. 

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  సోదరుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి  కూతురు వై.ఎస్.  సునీతా రెడ్డి కూడా రాజకీయాల్లోకి వస్తారనే  ప్రచారం సాగుతుంది.ఈ నెల  29న  వై.ఎస్. సునీతా రెడ్డి వై.ఎస్. షర్మిలతో భేటీ అయ్యారు. వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత  వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ కావడం  తొలిసారి. పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుండి  మరోసారి బరిలోకి దిగుతారు.  కడప పార్లమెంట్ స్థానం నుండి వై.ఎస్. అవినాష్ రెడ్డిని మరోసారి  ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. 

వై.ఎస్. సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వస్తే  ఆమె కానీ, ఆమె తల్లిని కానీ  ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ సాగుతుంది. మరో వైపు వై.ఎస్. షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. 

1978 నుండి  ఇప్పటివరకు  జరిగిన ఎన్నికల్లో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులే  పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు.  1978, 1983, 1985 ఎన్నికల్లో పులివెందుల నుండి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  విజయం సాధించారు.  1989లో  వై.ఎస్. వివేకానంద రెడ్డి  గెలుపొందారు.  1991లో జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్. పురుషోత్తమ రెడ్డి నెగ్గారు.  1994లో  వై.ఎస్. వివేకానంద రెడ్డి గెలుపొందారు.

also read:బ్రిడ్జికి కలెక్టర్ పేరు: కోనసీమ జిల్లావాసుల అభిమానం ఇదీ...

1999, 2004, 2009 ఎన్నికల్లో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు.  2009 సెప్టెంబర్  2న హెలికాప్టర్ ప్రమాదంలో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  మరణించిన తర్వాత  జరిగిన ఉప ఎన్నికల్లో  వై.ఎస్. విజయమ్మ నెగ్గారు. 2011లో  జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్. విజయమ్మ  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా నెగ్గారు. 2014, 2019 ఎన్నికల్లో పులివెందుల నుండి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు.

అయితే రానున్న ఎన్నికల్లో  వై.ఎస్. కుటుంబం నుండే ప్రత్యర్ది పార్టీల నుండి  రంగంలోకి దిగే అవకాశం ఉండడంతో  కడప జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయోననే  చర్చ సాగుతుంది. కడప జిల్లాపై  పట్టు ఉన్న వై.ఎస్. కుటుంబ సభ్యులే వేర్వేరు పార్టీల తరపున బరిలోకి దిగడంతో  ఏ మేరకు  ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.  

also read:స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ:ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ

వైఎస్ఆర్‌సీపీకి గట్టి పట్టున్న  కడప జిల్లాలోనే  ఆ పార్టీని దెబ్బకొట్టాలని  షర్మిల అడుగులు వేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలను  పార్టీలోకి ఆహ్వానిస్తుంది.  మాజీ మంత్రి డీ.ఎల్. రవీంద్రా రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలని కోరారు. మాజీ మంత్రి అహ్మదుల్లా  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అహ్మదుల్లా  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios