తెలుగోడి దెబ్బ.. బీజేపీ అబ్బ... బాలకృష్ణ

First Published 19, May 2018, 12:35 PM IST
hindururam MLA bala krishna intresting comment on karnataka elections
Highlights

ర్ణాటక ఎన్నికలపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్య

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.  కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారు బీజేపీకి తమ తడాఖా చూపించారన్నారు.ఆనాడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన చాలా పథకాలనే ఇప్పుడు ఇతర  రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కూడు, గూడు, గుడ్డ అన్న నినాదంతో పార్టీని స్థాపించి తొమ్మిది  నెలల్లోనే అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారాన్ని పంచిన మహానీయుడు ఎన్టీఆర్‌ అన్నారు. 

ప్రపంచ చలనచిత్ర రంగంలో మేటి నాయకుడు అని, ఆయన ప్రజాసేవ కోసం నటన నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టారన్నారు. బడుగుల జీవన విధానంలో మార్పునకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకె ళ్లేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
 

ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్‌ గుడి కట్టుకున్నారన్నారు. సరిహద్దులో ఉన్న చిక్కబళ్లాపురం జిల్లాలో ఎన్నికల్లో తెలుగోడి దెబ్బ చూపించారన్నారు. అక్కడ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కేలేదన్నారు.
 రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరారు కానీ ప్యాకేజీ ఇవ్వలేకపోయారని బీజేపీని విమర్శించారు.

loader