గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎంపీ ఫకీరప్ప చెప్పారు.
అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ స్పష్టం చేశారు.
అనంతపురం ఎస్పీ పకీరప్ప బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 4వ తేదీన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రకటించారు. టీడీపీ నేతలు తాను జిమ్ చేస్తున్న వీడియోను మార్పింగ్ చేశారని ప్రకటించారు.
ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు.
తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యూకేకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ నెంబర్ ఉపయోగిస్తుంది ఎవరనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. యూకే నుండి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని ఎస్పీ తెలిపారు.ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారనే విషయమై వివరాలు ఇవ్వాలని వొడాఫోన్ ను కూడా సమాచారం కోరినట్టుగా చెప్పారు.
ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకుప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని వీడియో ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారనే సందేహలున్నాయన్నారు.
ఓ వ్యక్తి పంపిన వీడియోను షూట్ చేసి మరో వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు.ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంతవరకు తమకు ఫిర్యాదు చేయలేదని ఎస్పీ చెప్పారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు.
also read:హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో: ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అనంత పోలీసులు
ఈ కేసు విషయమై బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉంటారని ఎస్పీ చెప్పారు.ఈ వీడియో పోస్టు చేయడానికి కొద్ది క్షణాల ముందే ఈ వాట్సాప్ గ్రూపులో ఈ నెంబర్ ను యాడ్ చేశారని తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా ఎస్పీ చెప్పారు