కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం (Hijab Row) నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తిచెందుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని (Vijayawada) లయోల కాలేజ్‌‌లో (Loyola college) హిజాబ్‌ వివాదం కలకలం రేపుతోంది.


కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం (Hijab Row) నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తిచెందుతుంది. గత నెలలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించినందుకు కాలేజీలోకి ప్రవేశం నిరాకరించారంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని (Vijayawada) లయోల కాలేజ్‌‌లో (Loyola college) హిజాబ్‌ వివాదం కలకలం రేపుతోంది. హిజాబ్ వేసుకొస్తే యాజమాన్యం కాలేజ్‌కు రానివ్వట్లేదని విద్యార్థినులు చెప్పారు. ఐడీ కార్డులోనూ హిజాబ్‌తోనే ఫొటో దిగామని తెలిపారు. ఫస్టియర్ నుంచి తాము బుర్కాలోనే కాలేజ్‌కు వెళ్తున్నామని చెప్పారు. 

ఈ విషయం తెలుసుకున్న ముస్లిం మత పెద్దలు లయోలా కాలేజ్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చెపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని విద్యార్థినులతో, కాలేజ్ యజమాన్యం‌తో మాట్లాడుతున్నారు. 

గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఆపుతున్నారంటూ విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి వారు కాలేజ్ ప్రన్సిపాల్‌తో మాట్లాడుతున్నారు.