ఆరువేలకు పైగా ధరఖాస్తులు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు భారీగా ధరఖాస్తులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుండి భారీగా ధరఖాస్తులు అందాయి.  రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా ధరఖాస్తులు వచ్చాయి.

Highest Applications Recevies From Secundrabad Cantonment Segment lns

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, పాలేరు అసెంబ్లీ స్థానాలకు అరవైకి పైగా  ధరఖాస్తులు అందాయి.గత నెల 4వ తేదీ నుండి  10వ తేదీ వరకు  పోటీ కోసం  ధరఖాస్తులను బీజేపీ నాయకత్వం స్వీకరించింది.  ధరఖాస్తులకు బీజేపీ నాయకత్వం ఎలాంటి ఫీజు నిర్ణయించలేదు.

రాష్ట్రంలోని  119 అసెంబ్లీ స్థానాలకు  6,002 అభ్యర్థులు ధరఖాస్తులు  చేసుకున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి  అత్యధికంగా  66 మంది ధరఖాస్తులు వచ్చాయి.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి  60 మంది ధరఖాస్తులు అందాయి.  ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీకి 50 మంది ధరఖాస్తు చేసుకున్నారు.ఈ నెల రెండో వారంలో  అభ్యర్థుల జాబితాను బీజేపీ  ప్రకటించే అవకాశం ఉంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  షెడ్యూల్ ను  త్వరలోనే  విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఈ నెల  రెండో వారంలో అభ్యర్థుల జాబితాను కమలదళం ప్రకటించనుంది.  

ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో  డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా   కొనసాగుతున్నారు. యూపీ నుండి  డాక్టర్ లక్ష్మణ్  రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి 50 మంది అభ్యర్థులు పోటీకి ధరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తరపున ఆయన అనుచరులు గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల నుండి టిక్కెట్టు కోరుతూ ధరఖాస్తులు సమర్పించారు.

also read:బ్రస్టాచార్ రిశ్వత్ సమితి: బీఆర్ఎస్‌పై జేపీ నడ్డాపై సెటైర్లు

గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి  10 ధరఖాస్తులు అందాయి.  ఈ అసెంబ్లీ స్థానం నుండి  రాజాసింగ్  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  రాజాసింగ్ ను బీజేపీ సస్పెన్షన్ విధించారు.ఎల్‌బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  నల్లు ఇంద్రసేనారెడ్డిలు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.  ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి  పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు.  మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సహా మరికొందరు నేతలు  ఆశిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios