బ్రస్టాచార్ రిశ్వత్ సమితి: బీఆర్ఎస్‌పై జేపీ నడ్డాపై సెటైర్లు

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు  ఇవాళ హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పై నడ్డా విమర్శలు చేశారు.

BJP National President JP Nadda Satirical Comments on KCR in BJP State Executive Council in hyderabad lns

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను  ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  కోరారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శుక్రవారంనాడు హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి.ఈ సమావేశంలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు.  ప్రధాని మోడీ నాయకత్వంలో  దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఆయన చెప్పారు.  ఎన్నికల సమయంలో తెలంగాణలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని  జేపీ నడ్డా విమర్శించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో  బీజేపీ బలపడుతుందని నడ్డా  చెప్పారు. బీజేపీనే జాతీయ పార్టీగా జేపీ నడ్డా పేర్కొన్నారు.జాతిని ఐక్యంగా ఉంచే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆయన  చెప్పారు.

సోనియా, రాహుల్, ప్రియాంకలదే  కాంగ్రెస్ పార్టీ అని ఆయన  విమర్శించారు.కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోడీదేనన్నారు. ఇందులో తెలంగాణకి చెందిన  రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని జేపీ నడ్డా చెప్పారు. 

 ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్ లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారన్నారు.  ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ను ఎందుకు అబివృద్ధి చేయలేదని జేపీ నడ్డా ప్రశ్నించారు. ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందన్నారు.  తెలంగాణలో కేసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు.

ఉజ్వల పథకం కింద సిలిండర్ కి 300 సబ్సిడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దీంతో 9కోట్ల 50లక్షల మందికి లబ్ది చేకూరుతుందని నడ్డా చెప్పారు. ఏడాదికి 6వేల కోట్లను రైతుల ఖాతాలో  కిసాన్ సమ్మన్ నిధి కింద జమ చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు.ఇందులో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారు 

తెలంగాణ లో బీజేపీ గెలవాలి... మరోసారి కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని నడ్డా పార్టీ కార్యకర్తలను కోరారు. తొమ్మిది ఏళ్లలో 9లక్షల కోట్లను తెలంగాణకు కేంద్రం కేటాయించిందని  నడ్డా చెప్పారు. రెండు రోజుల్లో 20వేల కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని  చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   

also read:హైద్రాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం: దిశా నిర్ధేశం చేయనున్న జేపీ నడ్డా

మరీ ఇక్కడున్న కేసిఆర్ ను గద్దె  దించాల్సిన అవసరం ఉందా?  లేదా? అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. బీ అర్ ఎస్ అంటే  బ్రస్టచార్ రిశ్వత్ సమితి పార్టీ అని విమర్శించారు.పదవ తరగతి క్వశ్చన్ పేపర్, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజి లకు పాల్పడిన ప్రభుత్వాన్ని గద్దె దింపల్సిన అవసరం ఉందని నడ్డా అభిప్రాయపడ్డారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజి తో 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం అడారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios