ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ.. కొందరు అధికారుల వల్ల ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలుగుతోంది. తాజాగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని ఓ ఎస్సై చితకబాదాడు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి చేసిన ఎస్సై వేటు పడింది. సత్యసాయి జిల్లా (sathya sai district) చిలమత్తూరు (chilamathur) ఎస్సైని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. పీఎస్‌కు వచ్చిన వ్యక్తిపై దాడి చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. కస్టోడియల్ హింసకు తావిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు డీఐజీ.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వేణు అనే వ్యక్తిపై దాడి చేశాడు ఎస్సై రంగడు. వికలాంగురాలికి పెన్షన్ మంజూరు చేయిస్తానని.. స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని, దామోదర్ రెడ్డిని ప్రశ్నించడానికి వెళ్లిన టైంలో తనపై దాడి చేసి అక్రమ కేసు బనాయించారని చెప్పాడు వేణు. ఇదే విషయాన్ని ఎస్సై దృష్టికి తీసుకెళ్లడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. బూతులు తిడుతూ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిలో భాగంగా రంగడునిరి వీఆర్‌కి పంపారు.
