Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో ఉద్రిక్తత: వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

ఆదివారం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెలగపూడిలో పలువురు గ్రామస్తులు వాటర్ ట్యాంకర్ ఎక్కేందుకు ప్రయత్నించారు. 

high tension in velagapudi over capital shifting
Author
Amaravathi, First Published Dec 22, 2019, 6:28 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలని జీఎన్ రావు కమిటీ సిఫారసు చేయడంతో అమరావతి ప్రాంత వాసులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల మద్ధతుతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెలగపూడిలో పలువురు గ్రామస్తులు వాటర్ ట్యాంకర్ ఎక్కేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. అంతకుముందు విద్యార్ధులు మందడం నుంచి వెలగపూడికి ర్యాలీ నిర్వహించారు. దీనితో సచివాలయం ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిపై సర్కార్ నిర్ణయాన్ని రెండు రోజుల్లోగా తెలపాలని డెడ్‌లైన్ విధించారు.     

Also Read:మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

మరోవైపు రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వంటి అంశాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఆదివారం రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఆయన రాజధానిగా అమరావతి ఉండేలా చట్టపరమైన రక్షణ ఉందని వెల్లడించారు.

సెబీ, రెరా వంటి చట్టాలు అమరావతికి రక్షణగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సెబీ ద్వారా ప్రభుత్వం రూ.2 వేల కోట్లను సేకరించిందని.. అలాంటప్పుడు ప్రభుత్వం సెబీకి ఏం సమాధానం చెబుతుందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లతో నిర్మించిన కట్టడాలను ప్రభుత్వం ఏం చేస్తుందని పుల్లారావు నిలదీశారు.

Also Read:రాజస్థాన్‌ ఎడారిలోకి వెళ్తున్నట్లుంది: అమరావతిపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు

రాజధాని తరలింపు విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతే ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని.. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందని, తాము అండగా ఉంటామని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios