క్రిష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభివృద్ధికి మేము కారణం అంటే.. మేము కారణం అంటూ ఇరు రాజకీయపార్టీలు సవాళ్లు విసురుకోవడంతో ముందస్తు చర్యగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.  

కృష్ణా జిల్లా : నూజివీడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో నూజివీడు నలువైపులా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు కాలుదువుతున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

"

ఇరు రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీస్ పీకేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బలగాల మోహరింపుతో నూజివీడు రాజకీయం వేడెక్కింది.