కర్నూలు జిల్లా నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా ముస్లింలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుంటున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కర్నూల్ జిల్లా నంద్యాలలో కానిస్టేబుల్ అబ్దుల్ సలాం  ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

ఈ నెల 3వ తేదీన ఆటో డ్రైవర్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ కేసు విచారణ చేసేందుకు గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు

గుంటూరు రేంజ్ ఆధ్వర్యంలో ఇవాళ కమిటీ నంద్యాలకు చేరుకొంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబం  సీఐ సోమశేఖర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

Also Read:ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్

జ్యూయలరీ షాపు దొంగతనం కేసులో సలాం ను అన్యాయంగా ఇరికించారని  ఆరోపించారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ సోమశేఖర్ రెడ్డిని శనివారం నాడు సస్పెండ్ చేశారు.

అబ్దుల్ సలాం బంధువుల నుండి సీఐపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో విచారణ  కమిటీ ఇవాళ ఈ కేసు విషయమై విచారణను ప్రారంభించింది.విచారణ ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత సోమశేఖర్ రెడ్డితో పాటు కానిస్టేబుల్  గంగాధర్ ను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకొన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆధేశాలతో ఈ కేసును పోలీసులు కూడ  దర్యాప్తును వేగవంతం చేశారు.తప్పు చేస్తే ఎంతటివారైనా వదలమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.