Asianet News TeluguAsianet News Telugu

ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్

కర్నూల్ జిల్లా నంద్యాలలో కానిస్టేబుల్ అబ్దుల్ సలాం  ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
 

nandyala ci somashekar reddy and constable gangadhar arrested for auto driver salam family suicide case lns
Author
Nandyal, First Published Nov 8, 2020, 6:08 PM IST


నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాలలో కానిస్టేబుల్ అబ్దుల్ సలాం  ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

ఈ నెల 3వ తేదీన ఆటో డ్రైవర్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ కేసు విచారణ చేసేందుకు గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు

గుంటూరు రేంజ్ ఆధ్వర్యంలో ఇవాళ కమిటీ నంద్యాలకు చేరుకొంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబం  సీఐ సోమశేఖర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

జ్యూయలరీ షాపు దొంగతనం కేసులో సలాం ను అన్యాయంగా ఇరికించారని  ఆరోపించారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ సోమశేఖర్ రెడ్డిని శనివారం నాడు సస్పెండ్ చేశారు.

also read:నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ

అబ్దుల్ సలాం బంధువుల నుండి సీఐపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో విచారణ  కమిటీ ఇవాళ ఈ కేసు విషయమై విచారణను ప్రారంభించింది.విచారణ ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత సోమశేఖర్ రెడ్డితో పాటు కానిస్టేబుల్  గంగాధర్ ను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకొన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆధేశాలతో ఈ కేసును పోలీసులు కూడ  దర్యాప్తును వేగవంతం చేశారు.తప్పు చేస్తే ఎంతటివారైనా వదలమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios