విశాఖపట్నంలోని నోవాటెల్ వద్ద పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జనసైనికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జనసైనికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది. పవన్‌ను చూసేందుకు విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనసైనికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అరుపులు, కేకలు, నినాదాలతో బీచ్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జనసైనికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. 

అంతకుముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే  ఇలానే  ఉంటుందని  రాష్ట్రంలో చోటు చేసుకున్న  పరిస్థితులపై  విమర్శించారు. విశాఖ పోలీసులు పవన్  కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు.  ఈ  నోటీసులు అందుకున్న తర్వాత   పవన్ కళ్యాణ్  మీడియాతో మాట్లాడారు. తాను  విశాఖపట్టణానికి  రాకముందే  గొడవ  జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు  ఇవ్వడాన్ని  పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.

Also REad:నేరస్తుడికి అధికారమిస్తే ఇలానే ఉంటుంది: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

సవాళ్లను ఎదుర్కొనేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు..ఎన్ని కేసులు  పెట్టినా, జైలుకు  వెళ్లేందుకు కూడా  తాము సిద్దంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గొంతెతొద్దు, ప్రశ్నించొద్దంటే  ఎలా అని ఆయన అడిగారు.  అడిగేవాళ్లు  లేరని ఇష్టానుసారం చేస్తున్నారని  జగన్ సర్కార్ పై  పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. బలహీనుల విషయంలో  పోలీస్ శాఖ  బలంగా పనిచేస్తుందన్నారు. ఎదురు దాడి చేసేవారి  విషయంలో  చాలా బలహీనంగా  పనిచేస్తుందని   ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని  డ్రోన్లను  నిషేధించారన్నారు.  రాజకీయాల్లో నేర చరిత్ర  గల నేతలు పోవాలంటే  ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.