మున్సిపల్ ప్రచారం ముగియడానికి కొన్ని క్షణాల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల చిన్న చిన్న  ఉద్రిక్త పరిస్ధితులు కనిపించాయి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

మోత్కుపల్లి సమీపంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తుండగా.. వైసీపీ- టీడీపీ శ్రేణులు పరస్పరం ఎదురుపడ్డాయి. ఈ సందర్భంగా రెండు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడే వుండటంతో పోలీసులు.. బాలకృష్ణను ప్రచార వాహనం ఎక్కించి పంపించారు.