Asianet News TeluguAsianet News Telugu

పంచాయతీ ఎన్నికలపై...చంద్రబాబుకు హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గడువు ముగిసినప్పటికీ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.90ని జారీ చేసింది. 

high court verdict on Panchayt elections in Andhra Pradesh
Author
Hyderabad, First Published Oct 23, 2018, 1:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గడువు ముగిసినప్పటికీ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.90ని జారీ చేసింది.

అయితే స్పెషల్ ఆఫీసర్లుగా దిగువ తరగతి ఉద్యోగుల్ని నియమిస్తోందని.. తక్షణం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు వినింది.

మాజీ సర్పంచ్‌ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు...స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేవేసింది.. దానితో పాటు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ఏపీ, తెలంగాణల్లోని గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన ఈ ఏడాది ఆగస్ట్ 1న ముగిసింది.. నాటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాదికారుల పాలన కొనసాగుతోంది. అయితే తెలంగాణలోని ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేత శ్రవణ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.. తాజాగా ఇప్పుడు ఏపీ విషయంలోనూ ఇదే తరహా తీర్పును వెలువరించింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios