వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తనపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌తో పాటు వీడియో ఫుటేజ్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

అనుచిత వ్యాఖ్యలు: బోడె ప్రసాద్ పై రోజా ఫిర్యాదు