అశోక్ బాబుకు హైకోర్టు షాక్: స్టేను రద్దు చేస్తూ తీర్పు

High Court gives shock to Ashok Babu
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. అడ్‌హాక్‌ కమిటీని రద్దు చేయాలని కోరుతూ అశోక్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. 

పిటిషన్‌పై స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ గౌడ్‌ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ సింగిల్‌ బెంచ్‌ స్టేను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. 

సర్వసభ్య సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని, సంవత్సరాంతం రిటర్న్స్‌ను ఎందుకు ఇంకా సమర్పించలేదని అశోక్‌బాబును హైకోర్టు ప్రశ్నించింది. నిబంధన ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డీసీవోను ఆదేశించింది.

loader