చంద్రబాబుకు బిగ్ షాక్ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ డిస్మిస్
చంద్రబాబు క్యాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు.
17ఏ, 490ప్రకారం సుదీర్ఘమైన వాదనలు వినిపించారు న్యాయవాదులు. కానీ వారి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. ఏకవాక్యంతో ‘పిటిషన్ డిస్మిస్డ్’ అని చెప్పి.. కుర్చిలోనుంచి లేచి వెళ్లిపోయారు. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఈ తీర్పును వెలువరించారు.
మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ పై మరికాసేపట్లో విచారణ జరగనుంది.