కొంతమూరు గ్రామంలోని 3-5-12 నంబరు ఇంటి నుంచి చోడవరపు గాంధారీ పేరుతో అధికారులకు ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు దరఖాస్తు అందింది. దరఖాస్తుకు హీరోయిన్ సమంత ఫోటోను జత చేశారు. అయితే ఆన్ లైన్ దరఖాస్తును బూత్‌ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలంచకుండా ఓటు నమోదు చేశారు. 

రాజమహేంద్రవరం : అక్కినేని వారి కోడలు, హీరోయిన్‌ సమంతకు రాజమహేంద్రవరంలో ఓటు నమోదైంది. ఆమె ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. 

కొంతమూరు గ్రామంలోని 3-5-12 నంబరు ఇంటి నుంచి చోడవరపు గాంధారీ పేరుతో అధికారులకు ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు దరఖాస్తు అందింది. దరఖాస్తుకు హీరోయిన్ సమంత ఫోటోను జత చేశారు. అయితే ఆన్ లైన్ దరఖాస్తును బూత్‌ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలంచకుండా ఓటు నమోదు చేశారు. 

అయితే రెండు రోజులపాటు ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా సమంత ఓటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమంత ఓటుపై అధికారులు ఆరా తియ్యగా గాంధారీ పేరుతో తమ ఇంట్లో ఎవరూలేరని ఆ ఇంటి యజమాని స్పష్టం చేశారు. దీంతో గాంధారీ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 

అంతేకాదు ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమూరు వీఆర్వో, బూత్ లెవెల్ అధికారిని రామాయమ్మపై వేటు వేశారు. వారిని సస్పెండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.