వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. తనకు మంచి మిత్రుడని హీరో సుమంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సుమంత్.. జగన్ తో తనకు ఉన్న బంధాన్ని ఓ మీడియా సంస్థతో వివరించారు.

జగన్, తాను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని సుమంత్ తెలిపారు. ఆ తర్వాత యూఎస్ కూడా కలిసి వెళ్లామని.. తాను అక్కడే ఉండిపోగా.. జగన్ మాత్రం ఇండియా వచ్చేశాడని చెప్పారు. మరో ఫన్నీ ఇన్సిడెంట్ ని కూడా వివరించారు.

‘జగన్, నేను రెస్టారెంట్‌కి వెళ్లి కొంచెం లేటుగా ఇంటికి వచ్చాం. తనను మా ఇంట్లోనే పడుకోమని చెప్పాను. లేటుగా వెళితే వాళ్లింట్లో ప్రాబ్లమ్ అని మా ఇంటికి వచ్చాం. నా ఇంటి తాళాలు మరచిపోయాను. నా బెడ్‌రూమ్ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) బెడ్‌రూమ్ పైన ఉండేది. దీంతో ఒక రెయిలింగ్ ద్వారా నా బెడ్‌రూమ్‌కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. కింద ఉన్న జగన్ నేను పైకి ఎక్కించేందుకు సాయం చేస్తున్నాడు. ఇంతలో సౌండ్ వినిపించి తాతగారు బయటకు వచ్చారు. కట్ చేస్తే.. నేను పైన.. జగన్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. అప్పటి వరకూ తాతగారు జగన్‌ను కలవలేదు. దీంతో ఆ సిట్యువేషన్‌లో తాతా.. రాజశేఖర్ రెడ్డిగారి అబ్బాయి జగన్ అని అక్కడ పరిచయం చేశా.’’ అని సుమంత్ వివరించారు. వీరిద్దరూ స్నేహితులు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.