బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో దేశ విదేశాల్లో ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన హీరో గ్రూప్ సంస్థ ఛైర్మన్‌ నౌహీరా షేక్‌పై విచారణ సాగుతున్న తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను ఆపేందుకు పెద్ద పెద్ద తలకాయలతో పాటు నౌహీరా అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కేసు విచారణలో సాక్షులు, బాధితులను అంతమొందించడానికి ఓ కిరాయి హంతక ముఠా తెలుగురాష్ట్రాల్లో సంచరిస్తోందని తెలుస్తోంది. నౌహీరాపై ఫిర్యాదు చేసినా.. సాక్ష్యం చెప్పినా చంపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా రివాల్వర్‌తో బాధితుల సెల్‌ఫోన్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ మేరకు కొందరు బాధితులు వీడియో ఫుటేజ్‌ను పోలీసులకు అందజేశారు. దీంతో హీరా కేసులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు బెదిరిపోతున్నారు. హీరా గోల్డ్ కేసులో ఉగ్రవాదులు సైతం పెట్టుబడి పెట్టినట్లు సీబీసీఐడీ నిర్థారించిన సంగతి తెలిసిందే.