ఏపిలో పిడుగులతో కూడిన అకాల వర్షం...ఒక్క జిల్లాలోనే ఏడుగురు మృతి
ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుపాటుతో కూడిన అకాల వర్షంతో ఏడుగురు మృతిచెందారు.
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీని కారణంగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలపై జిల్లా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన అకాల వర్షం కురిసింది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటు కారణంగా చనిపోవడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇకపై కూడా వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.