Heavy rains in AP: వరదలపై జ్యూడీషీయల్ విచారణకు చంద్రబాబు డిమాండ్
భారీ వర్షాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకొందని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. వరద పరిస్థితులపై జ్యూడిషీయల్ విచారణ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
చిత్తూరు: భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడా జగన్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా రాష్ట్రంలో భారీగా ఆస్తి, ప్రాణ నస్టం చోటు చేసుకొందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. మానవ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు.ఈ విషయమై జ్యూడిషీయల్ విచారణ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. Chittoor జిల్లా రేణిగుంటలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మానవ తప్పిదం వల్ల రాష్ట్రంలో అపార నష్టం చోటు చేసుకొందన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. జ్యూడీషీయల్ విచారణ నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రెండు రోజులు తాను వరద ప్రాంతాల్లో పర్యటించానన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని Chandrababu విమర్శించారు. Heavy rains పడుతాయని ముందస్తు సమాచారం ఉన్నా కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అనుభవరాహిత్యం, అహంకారం ప్రజలకు శాపమైందని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ సమర్ధత ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా పనిచేసినట్టైతే ఆస్తి, ప్రాణ నష్టం తగ్గి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం పెరిగిందన్నారు. వరద పరిస్థితులపై తమకు ఎలాంటి హెచ్చరికలు లేవని ప్రజలు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. Rayala cheruvu సమీప ప్రాంతాల ప్రజలు భయపడిపోయారన్నారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు డబ్బులు ఇవ్వలేదన్నారు.
also read:తిరుపతి : చంద్రబాబు రాయలచెరువు పరిశీలనకు పోలీసుల అనుమతి నిరాకరణ, ఉద్రిక్తత
రాష్ట్రంలో చోటు చేసుకొన్న వరద నష్టానికి సుమారు రూ. 1000 కోట్లు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా ఆయన లేఖలు రాశారు. భారీ వర్షాల కారణంగా ఏపీ రాష్ట్రంలోన కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ మూడు జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకొంది. చెయ్చేరు నది ప్రవాహంలో సుమారు 30 మంది గల్లంతయ్యారు. నందలూరు వద్ద మూడు ఆర్టీసీ బస్సులు నీటిలో మునిగాయి. వరద నష్టం అంచనా విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరో వైపు మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. మెట్ల మార్గంలో కొండ చరియలను తీసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. తిరుమల ఘాట్ రోడ్డుకు కూడా మరమ్మత్తులు చేస్తున్నారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొలుత కడప జిల్లాలో ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అయితే మరో రెండు మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.