జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. తీవ్ర ఉద్రిక్తత..
తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జేపీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు టీడీపీ శ్రేణులు రాకుండా అడ్డుకునేందుకు బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.
అయితే అందుకు అనుమతి లేదని.. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, టీడీపీ శ్రేణులు ఆయన నివాసం వద్దకు వెళ్లేందుకు వస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.