ఏలూరు:  నిబంధనలకు విరుద్దంగా కరోనా రోగులకు  చికిత్స చేయడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఏపీ అధికారులు సీజ్ చేశారు. 

పశ్చిమగో దావరి జిల్లాలోని ఏలూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుసత్రిని అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్నారు. 

ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. 

ఈ ఆసుపత్రి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్టుగా తేలింది. దీంతో ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఒక్కో రోగి నుండి రోజుకు లక్ష రూపాయాలను కరోనా చికిత్స కోసం వసూలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

రాష్ట్రంలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ సెంటర్లలో చాలా సెంటర్లు అనుమతులు  తీసుకోలేదని స్వర్ణ ప్యాలెస్ ఘటన సమయంలో అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా కూడ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.