Asianet News TeluguAsianet News Telugu

కేవీపీ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారా?.. సీబీఐకి హైకోర్టు సూటి ప్రశ్న...

కేవీపీ స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేసిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రికార్డు చేయలేదని సీబీఐ న్యాయవాది సమాధానం ఇచ్చారు. శ్రీలక్ష్మి చట్టం ప్రకారం వ్యవహరించారని న్యాయవాది రాఘవాచార్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, పిటిషనర్ మీద నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదావేసింది. 

Has the KVP statement been recorded? AP High Court question to CBI
Author
Hyderabad, First Published Dec 9, 2021, 11:39 AM IST

హైదరాబాద్ : Obulapuram Mining Company (ఓఎంసీ) కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించిన KVP Ramachandra Rao స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారా? అని హైకోర్టు CBIని ప్రశ్నించింది. ఓఎంసీ Mining leaseలకు సంబంధించిన వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద కె. లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కె. సురేందర్ వాదనలు వినిపిస్తూ.. OMC Mining లీజు అక్రమాల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని, ఆమె మీద సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లీజు కేటాయించే క్రమంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. 

ఈ సందర్భంగా శశికుమార్ అనే సాక్షి స్టేట్ మెంట్ ను సీబీఐ న్యాయవాది ధర్మాసనానికి చదివి వినిపించారు. మైనింగ్ లీజు కోసం అప్పటి ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న Srilakshmi వద్దకు వెల్తే.. కేవీపీ రామచంద్రరావును కలవాలని ఆమె చెప్పారని సాక్షి వెల్లడించినట్లు తెలిపారు. 

లీజుకు సంబంధించిన ఇతర అంశాల్లో సహాయం చేయడానికి అప్పటి మైన్స్ డైరెక్టర్ రాజగోపాల్ ను కూడా కలవాలని శ్రీలక్ష్మి చెప్పారని తెలిపారు. రూ. 8 లక్షలు సమకూర్చాలని శ్రీలక్ష్మి కోరినట్లు సాక్షి వెల్లడించారని తెలిపారు. ఓఎంసీకి చెందిన గాలి జనార్థన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ఇతర దరఖాస్తులను శ్రీలక్ష్మి తొక్కి పెట్టారని తెలిపారు. 

ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం కేవీపీ స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేసిందా? అని ప్రశ్నించింది. రికార్డు చేయలేదని సీబీఐ న్యాయవాది సమాధానం ఇచ్చారు. శ్రీలక్ష్మి చట్టం ప్రకారం వ్యవహరించారని న్యాయవాది రాఘవాచార్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, పిటిషనర్ మీద నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదావేసింది. 

Visakhapatnam: విశాఖ మధురవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

ఇదిలా ఉండగా, నవంబర్ 13న ఓబులాపురం మైనింగ్ కంపెనీ  Illegal mining caseలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సిఆర్ పిసి సెక్షన్ 173  ప్రకారం CBI తుది నివేదిక ఇచ్చేవరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాదులోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్ర చూడ్,  జస్టిస్ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో  ఇదే అభ్యర్థనతో  శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios