Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు అమిత్ షా ఫోనా ? ఏంటి నిజమే ?

  • 5వ తేదీన ఢిల్లీకి వస్తే అన్నీ విషయాలూ సావకాశంగా మాట్లాడుకుందామని అమిత్ ఫోన్లో చంద్రబాబును కోరారట.
Has Amit Shah really invited Naidu to Delhi for talks

చంద్రబాబునాయుడు దెబ్బకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భయపడిపోయారా? శుక్రవారం చంద్రబాబు ఎంపిలతో సమావేశం అయిన సందర్భంలోనే ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా షా ఫోన్ చేసి బ్రతిమిలాడినట్లు టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 5వ తేదీన ఢిల్లీకి వస్తే అన్నీ విషయాలూ సావకాశంగా మాట్లాడుకుందామని అమిత్ ఫోన్లో చంద్రబాబును కోరారట. అయితే, ‘తాను రానని కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపి రామ్మోహన్ నాయుడు, ప్లానింగ్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు వస్తార’ని చంద్రబాబు చెప్పారని ఒకటే ఊదరగొట్టేస్తోంది టిడిపి అనుకూల మీడియా.

ఇక్కడే అందరికీ ఓ అనుమానం వస్తోంది. మార్చి 1వ తేదీన ఢిల్లీలో అమిత్ షా తో రామ్మోహన్ నాయుడు, కుటుంబంరావు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏపికి రావాల్సిన నిధులు, ప్రయోజనాల గురించి లెక్కలతో  సహా ఇద్దరూ అమిత్ కు అందచేశారు. అయితే, ఏ విషయంలో కూడా అమిత్ నుండి ఇద్దరికీ హామీలు రాలేదు. అందుకే మరుసటి రోజు ఎంపిల సమావేశంలో చంద్రబాబు యధావిధిగా కేంద్రాన్ని హెచ్చరించినట్లు లీకులు ఇచ్చుకున్నారు.

ఈ నేపధ్యంలో అసలు చంద్రబాబునాయుడుకు అమిత్ షా నిజంగానే ఫోన్ చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయ్. ఎందుకేంటే. ముందురోజు టిడిపి బృందాన్ని లెక్కచేయని అమిత్ మరుసటి రోజే చంద్రబాబుకు ఫోన్ ఎందుకు చేస్తారు? చంద్రబాబు ఎన్ని డిమాండ్లు చేసినా, పార్లమెంటులో టిడిపి ఎంపిలు ఎంత గోల చేసినా ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఏమాత్రం ఖాతరు చేయలేదు.

రేపటి పార్లమెంటు సెషన్లో కూడా ఎంపిలను కేంద్రం ఖాతరు చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ సింగ్ ఫోన్ చేశారని, అమిత్ షా ఫోన్ చేసి బ్రతిమలాడుకున్నారని టిడిపి అనుకూల మీడియాలో రాయించుకుంటే ఏమొస్తుంది?

Follow Us:
Download App:
  • android
  • ios