రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన 48 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడిషియల్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. 

ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని హర్షకుమార్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుడు డిసెంబర్ 13వ తేదీన అరెస్టయిన ఆయన ఇప్పటి వరకు డైలులోనే ఉన్నారు. 

Also Read: రెండు నెలలుగా అజ్ఞాతంలోనే: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్

ఏ తప్పూ చేయకుండా తాను 48 రోజులు జైలులో ఉన్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. మూడు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినా జైలులోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉంటే మూడో రోజే తనను డిశ్చార్జీ చేశారని ఆయన అన్నారు.

Also Read: వ్యాఖ్యల చిక్కులు: చంద్రబాబు, హర్షకుమార్, వర్లలకు నోటీసులు