రిమాండ్ సమయంలో బాబు పేరు చేర్చారు: స్కిల్ కేసులో సుప్రీంలో చంద్రబాబు న్యాయవాది సాల్వే
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు నమోదు చేశారని హరీష్ సాల్వే సుప్రీంలో వాదించారు. ఈ కేసులో 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని ఆయన తన వాదనలు విన్పించారు.
న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు వాదనలు జరిగాయి.ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించిన తర్వాత వర్చువల్ గా చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదించారు.
17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని సాల్వే వాదనలు విన్పించారు.ఈ మేరకు పలు కేసులను హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు.1964 నాటి రతన్ లాల్ కేసును కూడా హరీష్ సాల్వే కోర్టు దృస్టికి తెచ్చారు.
ఎన్నికలకు ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17 ఏ సెక్షన్ ఉందని సాల్వే అభిప్రాయపడ్డారు. 17 ఏ సెక్షన్ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని సాల్వే వాదించారు.ఆధారాల సేకరణ కూడ సరైన పద్దతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు.
విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తుందని సాల్వే సుప్రీంలో వాదనలు విన్పించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో .
మొదట్లో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేని విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రిమాండ్ సమయంలో చంద్రబాబు పేరు చేర్చారని సాల్వే గుర్తు చేశారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని సాల్వే వాదించారు.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబు ఇప్పటికే 40 రోజులుగా జైలులో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కనీసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని సాల్వే అభ్యర్థించారు. వాదనలు ముగించే సమయంలో ఈ విషయమై రాతపూర్వకంగా కూడ తన వాదనలను విన్పించనున్నట్టుగా సాల్వే చెప్పారు.ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.