దివంగత ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు నివాళి అర్పించారు. హరికృష్ణను గుర్తు చేసుకున్నారు.

నేడు సీని నటుడు, దివంగత ఎంపీ నందమూరి హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళి అర్పించారు. రాజకీయాల్లో, సినీ రంగంలో ఆయన ఎంతో మందికి ఆత్మీయుడిగా ఉన్నారని చెప్పారు. హరికృష్ణ నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన తెలుగువారందరికీ అభిమానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. ఈ సంందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హరికృష్ణతో ఉన్న రిలేషన్ షిప్ ను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

Scroll to load tweet…

అలాగే టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా తన మేనమామను గుర్తు చేసుకున్నారు. హరి మామయ్య డేరింగ్ పొలిటీషియన్ అని అన్నారు. తన నటనతో ఎందరో మంది అభిమానులను సంపాదిచుకున్నారని తెలిపారు. తన మేనమామ ఎన్నో పదవులను అలంకరించారని అన్నారు. ఆయన ఆ పదవులకే వన్నె తెచ్చారని గుర్తు చేశారు. హరికృష్ణ మామయ్య తనకు సూర్తి అని అన్నారు. 

Scroll to load tweet…