హరిరామ జోగయ్య తనయుడిని పార్టీలో చేర్చుకున్న పవన్ కల్యాణ్

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 11, Aug 2018, 4:03 PM IST
Harairama Jogiah's son in Jana Sena
Highlights

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకున్నారు.సూర్యప్రకాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఏలూరు: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకున్నారు.సూర్యప్రకాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి నరసాపురంలో బహిరంగ సభ ముగించుకుని భీమవరం వెళ్తూ మార్గమధ్యలో పాలకొల్లులో హరిరామజోగయ్య నివాసానికి వెళ్లారు. 

దాదాపు గంట పాటు తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. పవన్ చేస్తున్న పోరాటాలను హరిరామజోగయ్య ప్రశంసించారు. ఆ తర్వాత తాను రాసిన 60 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకాన్ని ఆయన పవన్‌కు బహుకరించారు.

loader