టీడీపీ ఆరాటం.. పోరాటం ఆ 25 కోసమే.. రూ.53 వేల కోట్లు ఏం చేశారు: జీవీఎల్

gvl narasimharao comments on telugu desam party
Highlights

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన సాగుతోందని.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టీడీపీ దుష్ట రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన సాగుతోందని.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టీడీపీ దుష్ట రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మనకు నిధులు లేవని చెబుతూ.. కొన్ని వేల కోట్ల రూపాయలను అధికారుల వ్యక్తిగత ఖాతాల్లో వేసిందని విమర్శించారు.

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో రూ.53,039 కోట్ల రూపాయలు మాయమైనట్లు స్వయంగా కాగ్ రిపోర్ట్ చెబుతోందని స్పష్టం చేశారు. ఇంత డబ్బును ఎవరి ఖాతాలో వేశారు..? ఎందుకు వేశారో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. సాక్షాత్తూ కాగ్‌నే తప్పు దోవ పట్టిస్తూ వివరాలు సరిగా చెప్పలేదని.. తెలుగుదేశం పార్టీ పర్సనల్ అకౌంట్ల స్కాంను జాతీయ స్థాయిలో వెలుగులోకి తెస్తామని నరసింహారావు  స్పష్టం చేశారు. 25 ఎంపీ సీట్ల కోసమే టీడీపీ ఆరాటం.. పోరాటమని విమర్శించారు. 
 

loader