ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ట్వీట్లు చేశారు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ. ఓ వైపు రాష్ట్రంలో పెథాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంటే ..ముఖ్యమంత్రిగా అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపించాల్సిన చంద్రబాబు నీరో చక్రవర్తిగా వ్యవహారిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తుఫాను ముంచుకోస్తుంటే పక్క రాష్ట్రంలో విహ్రావిష్కరణకు వెళతావా..? ఇదే నా సీఎం బాధ్యత అంటూ దుయ్యబట్టారు. ఒక పక్క పెథాయ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జైపూర్, భోపాల్‌లలో ప్రమాణ స్వీకారానికి వెళ్లడం రోమన్ చక్రవర్తి నీరో రోమ్ నగరం తగటబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.. మీరు చక్రవర్తి కాదు.. భరించడానికి ఆంధ్రాప్రజలు రోమన్లు కాదని జీవీఎల్ మండిపడ్డారు.