గురువారెడ్డి సూసైడ్‌లో ట్విస్ట్: ప్రియుడితో ఎఫైర్‌పై నిలదీస్తే షాకిచ్చిన భార్య

Guruva reddy suicide case: Gayatri extra marital affair with kartik
Highlights

లవర్‌తో ఎఫైర్ ప్రశ్నించినందుకు భర్తకే షాకిచ్చిన భార్య

 అమరావతి: విజయవాడలో ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్పీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకొన్న గురువారెడ్డి  కేసులో మరో  ట్విస్ట్ చేసుకొంది. గురువారెడ్డి భార్య కు కార్తీక్ అనే యువకుడికి మధ్య ఎఫైర్ ఉందని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై నిలదీసినందుకే గురువారెడ్డిపై తప్పుడు కేసు పెట్టి బెదిరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన  గురువారెడ్డి అనే  వ్యక్తి మంగళవారం నాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు  సెల్పీ వీడియో తీసుకొన్నారు. తన బాధను ఆయన ఆ వీడియోలో రికార్డ్ చేశారు.ఈ సెల్పీ వీడియో రికార్డు చేసిన  కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారెడ్డి మృతిపై విచారణ జరిపారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గురువారెడ్డి భార్యకు కార్తీక్ అనే యువకుడికి మధ్య ఎఫైర్ ఉందని పోలీసులు గుర్తించారు.

తన భార్య, కార్తీక్ ల మధ్య చాటింగ్, ఫోన్ సంభాషణల విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు గురవారెడ్డి. అయితే ఈ విషయమై  గురువారెడ్డిని బెదిరించేందుకు గాను గురువారెడ్డి భార్య, తల్లిదండ్రులు, బావ మరిది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారెడ్డిని పిలిచి విచారించారు. అయితే  తాను ఎలాంటి తప్పు చేయకున్నా రెండు రోజుల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పారని గురువారెడ్డి మనోవేదనకు గురయ్యాడు.

కార్తీక్‌తో తన భార్యకు ఉన్న సంబంధం విషయమై చోటు చేసుకొన్న విషయమై నిలదీస్తే  తనను దోషిగా చిత్రీకరించారని  గురువారెడ్డి మనస్థాపం చెందారు.  తనను భార్యతో పాటు అత్తింటివారు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనే విషయమై సెల్పీ వీడియోలో రికార్డింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

loader