వైసిపి కి గుర్నాధరెడ్డి గుడ్ బై ?

Gurnadhreddy brothers to join in tdp
Highlights

  • గుర్నాధరెడ్డి బ్రదర్స్ వైసిపికి గుడ్ బై చెబుతున్నారా ?

గుర్నాధరెడ్డి బ్రదర్స్ వైసిపికి గుడ్ బై చెబుతున్నారా ? అనంతపురం, అమరావతి కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గురువారం అమరావతిలో చంద్రబాబునాయుడు సమక్షంలో సోదరులిద్దరూ టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం. మాజీ ఎంఎల్ఏ గుర్నాధరెడ్డి టిడిపిలో చేరటాన్ని చాలాకాలంగా అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర చౌదరి తదితరులు అడ్డుకుంటున్న విషయం అందరకీ తెలిసిందే. గుర్నాధరెడ్డి టిడిపిలో చేరుతున్నారన్న సమాచారంతో ఎంఎల్ఏ అభద్రతకు గురవుతున్నారు.

ఇపుడు గుర్నాధరెడ్డి కనుక టిడిపిలో చేరితో రేపటి ఎన్నికల్లో తనకు టిక్కెట్టు రాదేమోనన్న ఆందోళన చౌదరిలో స్పష్టంగా కనబడుతోంది. అందుకోసమే మంత్రి పరిటాలసునీత తదితరుల మద్దతుతో గుర్నాధ్ చేరికను చౌదరి అడ్డుకుంటున్నారు. అదే విషయమై ఈరోజు చౌదరి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయమై చంద్రబాబు హామీ ఇవ్వటంతో చౌదరి ఏమీ మాట్లాడలేకపోయారు. దాంతో గుర్నాధరెడ్డి చేరిక లాంఛనమేనని అని తేలిపోయింది.

 

loader