గుంటూరు: అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గుంటూరు జిల్లా శివాపురం తండాలో అప్పలు చెల్లించలేదనే నెపంతో మంత్రుభాయిని సోమవారం నాడు శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు.ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు మంగళవారం నాడు నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. 

also read:అప్పు చెల్లించని వృద్దురాలిని ట్రాక్టర్‌తో తొక్కి చంపించిన వైసీపీ నేత

నకరికల్లు మండలంలోని నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి రూ. 3.90 లక్షలను మంత్రుభాయి దంపతులు మూడేళ్ల క్రితం అప్పు తీసుకొన్నారు. 

వడ్డీతో సహా అప్పును చెల్లించాలని మంత్రుబాయ్ దంపతులను శ్రీనివాస్ రెడ్డి కోరాడు. అయితే ఇప్పుడే డబ్బులు చెల్లించలేమని గిరిజన దంపతులు చెప్పారు. అయితే పొలాన్ని స్వాధీనం చేసుకొంటానని శ్రీనివాస్ రెడ్డి బెదిరించాడు.

ఈ క్రమంలోనే కొంత కాలంగా అప్పు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి కోరాడు. కానీ సోమవారం నాడు  మరోసారి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పొలంలో పనులు చేసుకొంటున్న మంత్రూబాయిపై శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ ను ఢీకొట్టి చంపాడని కుటుంబసభ్యులు చెప్పారు.