అమరావతి: తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చేలా కనబడటం లేదు. లోక్ సభ విప్ పదవిపై అలిగిన కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నానిని బుజ్జగించేందుకు బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గల్లాజయదేవ్ ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని మాత్రం వెనక్కి తగ్గలేదు. 

మరోసారి సోషల్ మీడియా వేదికగా పోరాడితే తప్పేముంది బానిస సంకేళ్లు తప్ప అంటూ మరో కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు గల్లా జయదేవ్ మరోసారి  చంద్రబాబు నాయుడును కలిశారు. కేశినేని నాని ఎపిసోడ్ పై చర్చిస్తున్ననట్లు తెలుస్తోంది

లోక్ సభ విప్ గా అవకాశం ఇవ్వడంపై అలిగిన కేశినేని నాని ఆ పదవికి తాను అర్హుడను కాదంటూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో అలజడి చెలరేగింది. 

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  కుటుంబానికి రెండు కీలక పదవులు కట్టబెట్టడంపై కేశినేని నాని అలకబూనారంటూ వార్తలు వచ్చాయి. గల్లాజయదేవ్ కు పార్లమెంటరీ నేతగా, ఆయన తల్లి గల్లా అరుణకుమారికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించడంపై ఆయన అలకబూనారు.  

దీంతో గల్లా జయదేవ్ నేరుగా కేశినేని నాని ఇంటికి వెళ్లడం చర్చించడం కూడా జరిగింది. అయినప్పటికీ కేశినేని నాని పంతం వీడలేదు. సయోధ్య కుదరకపోవడంతో నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. 

ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నానిలతో సుమారు గంటసేపు చర్చించారు. సమావేశంలో తనకు ఎలాంటి పదవి అవసరం లేదని కేశినేని నాని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవి ఉందని అంతకుమించి పెద్ద పదవి అక్కర్లేదని నేరుగా చంద్రబాబు వద్దే తెగేసి చెప్పారట. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని తాను పార్టీ వీడేది లేదని చంద్రబాబుకు స్పష్టం చేశారు కేశినేని నాని. 

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి కామెంట్ పెట్టడంతో ఎపిసోడ్ మళ్లీ మెుదటికి వచ్చింది. చంద్రబాబును కలిసేందుకు గల్లా జయదేవ్ ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ తీరుపై కేశినేని ఆసక్తికర వ్యాఖ్య: ట్రోల్ చేస్తున్న నెటిజన్లు