ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలతో బాలికకు దగ్గరై.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... బాలికను అతి దారుణంగా మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  బొల్లాపల్లి మండలానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. కాగా.. ఆమెకు రెండు సంవత్సరాల క్రితం శివనాయక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  శివనాయక్... సత్తెనపల్లిలోని వెటర్నరీ వైద్యశాలలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. కాగా... అతని కన్ను సదరు బాలికపై పడింది. ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకుంటానంటూ బాలికకు మాయమాటలు చెప్పాడు. తాను చెప్పేది నిజం అని నమ్మేలా బాలికను మాయ చేశాడు.

గుంటూరులో ఇంటర్‌ చదువుతున్న బాలికను శివానాయక్‌ ప్రేమపేరుతో అప్పుడప్పుడు సత్తెనపల్లిలోని తన రూమ్‌కు తీసుకొచ్చి శారీరకంగా అనుభవించాడు. కాగా వీళ్ల వ్యవహారం ఇటీవల బాలిక ఇంట్లో తెలిసిపోయింది. దీంతో  పెళ్ళి చేసుకోమని, బాలిక, ఆమె కుటుంబ సభ్యులు శివనాయక్ ని కోరాడు. దానికి అతను అంగీకరించలేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని బెదిరిపులు,  ఒత్తిడి చేసినా అంగీకరించలేదు. దీంతో బాలిక, ఆమె కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ విజయచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.