నంద్యాలలో వైసీపీకి ఎదురుదెబ్బ సచివాలయంలో సీఎంను కలిసిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి అచ్చెన్నాయుడుతో కలిసి చంద్రబాబుతో సమావేశమైన గంగుల ప్రతాప్ రెడ్డి తెదేపాలో చేరుతున్నట్లు చంద్రబాబుకు తెలిపిన గంగుల ప్రతాప్ రెడ్డి
వైసీపి పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన మొదట వైసీపిలో చెరుతారని అందరు భావించిన చివరకు టీడీపీలో చేరుతున్నట్లు తెలస్తుంది. గంగుల ఇప్పటికే టీడీపీలో చేరే విషయమై ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడితో కాసేపు చర్చించారు. అనంతరం ఇరువురు కలిసి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు.
అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో ఉన్న చంద్రబాబు నాయుడి వద్దకు ప్రతాప్ రెడ్డి వచ్చారు. టీడీపీలో చేరే అంశంపై ఆయన చంద్రబాబుతో చర్చించనున్నట్లు సమాచారం. గంగులకు వైసీపి నంద్యాల సీటు ఇస్తే వైసీపిలోకి మారాలని భావించారు. ఆ దిశగా మొదట ప్రయత్నాలు కూడా జరిగాయి, కానీ చివరకు శిల్పామోహాన్ రెడ్డికి సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గంగుల వైసీపి పార్టీ నంద్యాల సీటు ఇస్తుందని భావించిన ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తుంది. చంద్రబాబును కలిసి అనంతరం ఆయన నిర్ణయం తీసుకొనున్నారు.
