Asianet News TeluguAsianet News Telugu

గుడివాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం వుంది.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశమే ఈ గుడివాడ నియోజకవర్గం నుండి మొదలయ్యింది. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది... ఈ సమయంలోనే గుడివాడ పేరు మారుమోగింది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని పాలిటిక్స్ గుడివాడను మరింత ఫేమస్ చేసాయి. వరుసగా నాలుగుసార్లు గుడివాడ నుండే పోటీచేసిన నాని ఓటమి ఎరగడు... ఐదోసారి కూడా ఆయన గుడివాడ నుండే పోటీ చేస్తున్నాడు. దీంతో ఈసారి గుడివాడ ప్రజలు తీర్పుపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. 

Gudivada assembly elections result 2024 AKP
Author
First Published Mar 10, 2024, 3:16 PM IST

గుడివాడ రాజకీయాలు : 

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ముందు గుడివాడలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోటీ వుండేది. కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత గుడివాడ టిడిపికి కంచుకోటగా మారింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ మొదటిసారి పోటీచేసి గెలుపొందారు... టిడిపి కూడా ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తర్వాత రావి కుంటుంబం కొంతకాలం గుడివాడ రాజకీయాలను శాసించారు. శోభనాద్రి చౌదరి (1985, 1994), రావి హరిగోపాల్ (1999), రావి వెంకటేశ్వరరావు (2000) లు గుడివాడ ఎమ్మెల్యేలుగా చేసారు. అయితే గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ (2004,2009, 2014, 2019) కొడాలి నాని గుడివాడ నుండి బంఫర్ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం గుడివాడ అనగానే ఠక్కున కొడాలి నాని పేరు గుర్తుకువస్తుంది.


గుడివాడ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. గుడ్లవల్లేరు
2. నందివాడ 
3. గుడివాడ 

గుడివాడ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ‌-  2,08,305

పురుషులు - 1,00,483  

మహిళలు - 1,07,891 

గుడివాడ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి : 

గుడివాడ నుండి మళ్లీ కొడాలి నాని బరిలోకి దిగనున్నారు. ఆయనను వైసిపి గుడివాడ నుండి తప్పించనుందని... పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండల హనుమంతరావుకు టికెట్ కేటాయించనుందని ప్రచారం జరిగింది. కానీ హన్మంతరావు చేతే గుడివాడ వైసిపి అభ్యర్థి కొడాలి నాని అని చెప్పించారు ఎమ్మెల్యే.  
 
టిడిపి అభ్యర్థి : 

గుడివాడ టిడిపి అభ్యర్థిగా వెనిగండ్ల రామును నియమించారు. రావి వెంకటేశ్వరరావు ఈ సీటును ఆశించినా టిడిపి అదిష్టానం మాత్రం రాము వైపే మొగ్గు చూపింది. 


గుడివాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

గుడివాడ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు -  1,67,902 (80 శాతం)

వైసిపి- కొడాలి వెంకటేశ్వరరావు (నాని) - 89,833 (53 శాతం) - 19,479 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి  - దేవినేని అవినాష్ - 70,354 (41 శాతం) - ఓటమి 

 


గుడివాడ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 1,58,428

వైసిపి - కొడాలి నాని - 81,298 (55 శాతం) - 11,537 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - రావి వెంకటేశ్వరావు - 69,761 (44 శాతం) - ఓటమి 
  
 

Follow Us:
Download App:
  • android
  • ios