Asianet News TeluguAsianet News Telugu

గుడివాడ అమర్ నాథ్: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Gudivada Amarnath Biography: వైఎస్ జగన్ కు వీరాభిమానిగా , మూడు తరాల రాజకీయ చరిత్ర గల యువనేతగా గుర్తింపు పొందిన నేత మంత్రి గుడివాడ అమర్ నాథ్. సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ.. ప్రజలకు నిత్యం అండగా ఉండే అనకాపల్లి నాయకుడు.  తాత. నాన్నల లెగసీని కంటిన్యూ చేస్తూ యువనేతగా ఎదుగుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ స్టోరీ మీకోసం.. 

Gudivada Amarnath Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 20, 2024, 2:04 PM IST

Gudivada Amarnath Biography: 

బాల్యం, విద్యాభ్యాసం: 

గుడివాడ అమర్ నాథ్ 1985 జనవరి 22న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గుడివాడ గురునాథ్ రావు- నాగమణి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో.. అలాగే విశాఖపట్నంలో సాగింది. ఆ తరువాత  ఇంటర్మీడియట్ విజాగ్ లోని వికాస్ కాలేజ్  లో చదువుకున్నారు. ఆ తర్వాత అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ 2006లో పూర్తి చేశారు. 
అమర్ నాథ్ కు హిమగౌరీతో 2013లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా ఉన్నారు.  

కుటుంబ నేపథ్యం

మూడు తరాలుగా గుడివాడ అమర్నాథ్ కుటుంబం రాజకీయాల్లో ఉంది. గుడివాడ అమర్నాథ్  తాతయ్య గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేశారు. పెందుర్తిలో సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలందించారు. గుడివాడ అప్పన్న గారు 1978లో పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు గురునాథ్ రావు  కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. గుడివాడ గురునాథ రావు గారు 1989 నుంచి 1994 వరకు పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలు అయ్యారు. 

గుడివాడ గురునాథ్ రావు వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో పార్టీకి గురునాథ్ సేవ ఎంతో చేస్తున్నరని ఆనాడు వైఎస్ గుర్తించారు. కానీ, గుడివాడ గురునాథ్ రావుచిన్న వయసులోనే మరణించారు. ఆ సమయంలో ఆయన కుమారుడు అమర్నాథ్ చిన్నవాడు. తన తండ్రి మరణించే నాటికి అమర్ నాథ్ వయస్సు పదహారేండ్లు మాత్రమే. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు వారి ఇంటికి వచ్చి పరామర్శించారు. అమర్ నాథ్ కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో అమర్ నాథ్  తల్లి నాగమణి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చెప్పారు. 

రాజకీయ జీవితం
 
2004 ఎన్నికల సమయం వచ్చింది.  కానీ,  టికెట్ రాలేదు.ఈ సమయంలో వారి కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారితో కలిసి వైయస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారు అమర్ నాథ్.  కానీ ఫలితం లేకుండా పోయింది. ఇలా ఈ ఎన్నికల్లో గుడివాడ కుటుంబం ఇక పోటీ చేయలేదు. కానీ, 2007లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ పెద్దనాన్న రామ్మూర్తికి టికెట్ ఇచ్చింది. 

టీడీపీలో చేరిక

ఈ విషయాన్ని అమర్ నాథ్ తల్లి నాగమణి గారు కేడర్ తో చర్చించి టీడీపీలో చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అమర్ నాథ్ కుడా  కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడుగా కూడా పనిచేశారు. అతి చిన్న వయసులోనే ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా అమర్నాథ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక 2009 ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో  ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేయడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ తరుణంలో టిడిపి అమర్నాథ్ తల్లి నాగమణి గారికి విశాఖపట్నం సీట్ ఇచ్చింది. సొంత సెగ్మెంట్లు అవగాహన రాకపోవడంతో విశాఖ వెస్ట్ సీట్ నుంచి అఇష్టంగానే పోటీ చేస్తారు. ఈ సమయంలో తన తల్లి గెలుపుకోసం ప్రచార బాధ్యతలను  అమర్నాథ్ దగ్గర నుండి చూసుకున్నారు.  కానీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యాయి. 

ఆ తర్వాత సమైక్యాంతర ఉద్యమం మొదలైంది.  రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ ధోరణి నచ్చిన ఆయన 2011లో టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గుడివాడ అమర్నాథ్, ఆమె తల్లి నాగమణి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు.  ఈ సమయంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఆయన పని చేశారు. ఇక 2014 ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమర్నాథ్ వయస్సు కేవలం 29 సంవత్సరాలు. ఈ  ఎన్నికల్లో మొత్తం శ్రీనివాసరావు చేతిలో అమర్నాథ్ ఓటమిన్ పాలయ్యారు. అయినా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ వెంటేనే నడిచారు. ఈ తరుణంలో విశాఖ రైల్వే జోన్ కోసం 256 కిలోమీటర్లు పాదయాత్రలు కూడా చేశారు అమర్నాథ్. దీంతో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బాధ్యతలను ఆయనకు అప్పగించారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు

ఇక 2019 ఎన్నికల్లో అమర్నాథ్ కి జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీల గోవిందం సత్యనారాయణ పై 8169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తొలి క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ సమయంలో కుదరలేదు. రెండోసారి క్యాబినెట్ విస్తరణంలో ఆయనకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి అక్రమ ఆరోపణలు లేవు ప్రజానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఎవరైనా కామెంట్ చేసినా లేదా విమర్శలు చేసిన తనదైన శైలిలో  కౌంటర్లు ఇస్తారు మంత్రి అమర్నాథ్. ముఖ్యంగా జనసేన, పవన్ కళ్యాణ్ పై నిత్యం కామెంట్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో జనసైనికులు ఆయన్ని ఎంత ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ అంటారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన గాజువాక నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున అమర్నాథ్ పోటీ చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios