పెళ్లికి గంటల ముందే వరుడికి షాక్, ఆగిన పెళ్లి: ఆసుపత్రికి క్యూ కట్టిన బంధువులు
పెళ్లికి ఒక్క రోజు ముందే వరుడికి కరోనా సోకింది. దీంతో అతడిని క్వారంటైన్‌కి తరలించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు కరోనా పరీక్షలకు పరుగులు తీశారు.
కాకినాడ: పెళ్లికి ఒక్క రోజు ముందే వరుడికి కరోనా సోకింది. దీంతో అతడిని క్వారంటైన్‌కి తరలించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు కరోనా పరీక్షలకు పరుగులు తీశారు.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన యువకుడు బిళ్లకూరుకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ అంగీకారంతో ఈ నెల 24వ తేదీన పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.
also read:ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు కరోనాతో మృతి
పెళ్లికి అంగరంగంగా ఏర్పాట్లు కూడ చేశారు. మూడు రోజులుగా యువకుడికి జ్వరం వస్తోంది. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చాడు. యువకుడిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తుండగా అతని ఫోన్ కు మేసేజ్ వచ్చింది. ఈ మేసేజ్ పెళ్లి వాయిదా పడేలా చేసింది.
యువకుడికి కరోనా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ నుండి మేసేజ్ వచ్చింది.ఈ మేసేజ్ చూసిన వరుడు షాక్ కు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారులు వరుడిని క్వారంటైన్ కు తరలించారు.
పెళ్లి వేడుకల్లో పాల్గొన్న బంధువులు, కుటుంబసభ్యులు వరుడితో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు వీరికి భయం పట్టుకొంది. కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు వీరంతా ఆసుపత్రులకు క్యూ కట్టారు.ఈ నెల 24వ తేదీన పెళ్లి జరగాల్సిన సమయంలో వరుడికి కరోనా సోకడంతో పెళ్లి వాయిదా పడింది.