కర్నూలులో ఓ నవ వరుడు పెళ్లైన కొద్ది గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

నంద్యాల : నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గంటలు గడవకముందే వరుడు శివకుమార్ మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివ కుమార్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కాగా, జూన్ 16న బీహార్లోని చంపారణ్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ నవ వధువు తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయింది. భగవాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయాబ్‌గంజ్ స్థానిక ఒకటో వార్డు లోఘోరం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ దాస్ (29) అనే యువకుడికి గోపాల్గంజ్ జిల్లాకు చెందిన సిమ్రాన్ కుమార్ (23)కి వివాహం జరిగింది. తావే ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. కొన్ని రోజులపాటు అందరూ బాగానే ఉన్నారు.

దారుణం.. వితంతువుకు లైంగిక వేధింపులు.. కోరికతీరిస్తే అండగా ఉంటానంటూ ఎర...

అయితే సిమ్రాన్ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడంతో భర్తకు అనుమానం వచ్చింది. వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానించాడు. ఆమె వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లాక్కొని.. బేసిక్ ఫోన్ ఇచ్చాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఐతే మంగళవారం ఇంట్లో సంతోష్ తప్ప ఎవరూ లేవరు. అందరూ ఇరుగుపొరుగు వారికి పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో సిమ్రాన్ ఓ యువకుడిని ఇంటిని పిలిచింది. తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. సిమ్రాన్ నిత్యం తరచూ ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండడం.. బంధువని చెప్పి ఓ యువకుడిని ఇంటికి పిలవడంతో భర్తకు అనుమానం పెరిగింది. 

ఆమెను నిలదాద్దీమనుకునేలోపే ఘోరం జరిగింది. సిమ్రాన్, ఆ యువకుడు కలిసి.. సంతోష్ ను చంపేశారు. ఆ తరువాత ఫ్యాన్ కు వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను తీసుకుని.. ఇంటికి తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులంతా ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. సంతోష్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సిమ్రాన్ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏదో జరిగిందని వారిలో అనుమానం కలిగింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ సంతోష్ శవం కనిపించింది.

అందరూ షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులంతా సిమ్రాన్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంటికి తాళం వేసి వెళుతుండగా కొందరు స్థానికులు చూశారు. అందువల్లే ఆమె హత్య చేసిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నెల రోజులకే భర్తను హత్య చేసిన ఘటన వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.