తల్లి, తాతలపై రాడ్డుతో దాడి చేసి.. యువతిని అపహరించిన ప్రేమోన్మాది.. తాత పరిస్థితి విషమం...
ప్రేమ పేరుతో యువతి వెంటపడి వేధించిన ఓ ప్రేమోన్మాది. ఆమె తల్లి, తాతల మీద రాడ్డుతో దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేశాడు.

పశ్చిమగోదావరి : యువతులపై ప్రేమోన్మాదుల దాడులు కలవరం రేపుతున్నాయి. ప్రేమను ఒప్పుకోలేదని, ప్రేమించడానికి నిరాకరించిందని.. అమ్మాయిల మీద కర్కశంగా దాడులకు పాల్పడుతున్నారు ప్రేమోన్మాదులు. వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది.
ఓ యువకుడు. తాను ప్రేమించిన యువతి. తల్లి, తాతల మీద దాడి చేసి… వారిని తీవ్రంగా గాయపరిచి.. యువతిని బెదిరించి.. బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకినీడు మండలం సిద్దాపురం గ్రామంలో చోటుచేసుకుని.. తీవ్ర కలకలానికి దారి తీసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. అధికారిక ప్రకటన
ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… వయసు పైబడిన ముస్లిం దంపతులు సిద్దాపురం గ్రామంలో వివసిస్తున్నారు. ఆ దంపతుల్లో మహిళకు అనారోగ్యంతో తణుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. దీంతో ఆయన ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వారి కుమార్తె వివాహమై ఏలూరులో ఉంటుంది. తల్లి అనారోగ్యం, తండ్రి ఒంటరిగా ఉండడాన్ని చూసి కూతురితో(20) పాటు ఇటీవలే సిద్దాపురం వచ్చింది.
అయితే.. ఆమె కూతురుని గతంలో ప్రేమ పేరిట అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు షేక్ ఇమ్రాన్ వేధించేవాడు. ఇప్పుడు ఆమె.. తాత దగ్గరికి వచ్చిన విషయం తెలిసింది. అది గమనించిన షేకిమ్రాన్ మంగళవారం తెల్లవారుజామున వారి ఇంటికి వచ్చాడు. యువతి తాత బయట బల్లమీద నిద్రిస్తుండడంతో అతడిని ఇనపరాడ్తో విచక్షణ రహితంగా తలమీద కొట్టాడు.
ఈ దెబ్బలకు తాలలేక అతడు కేకలు వేయగా.. యువతి తల్లి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఆమె పైన కూడా ఇమ్రాన్ రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ గలాటాకు లేచి వచ్చిన యువతిపై కూడా దాడి చేయబోయి… యువతి తన వెంట రావాలని.. లేకపోతే తల్లి, తతను చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత యువతిని బలవంతంగా బండిమీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
ఈ గొడవకు మేల్కొన్న చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి తీవ్ర గాయాలతో తల్లి, తాత ఉన్నారు. దీంతో వారిద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం వీరిద్దరూ భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో తాత పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తల్లి తలపై కూడా దాదాపు 50 కుట్లు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. యువతి ఆచూకీ తెలియలేదు.