Asianet News TeluguAsianet News Telugu

డ్రోన్‌ ద్వారా పూలమాల.. మంత్రి గౌతమ్ రెడ్డికి వైసీపీ నేతల వినూత్న స్వాగతం

కర్నూలు (kurnool District) జిల్లా ఆత్మకూరు ( atmakur) నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy)కి వినూత్నరీతిలో స్వాగతం పలికారు వైసీపీ నేతలు. 

grand welcome to minister gautam reddy with drone in kurnool district
Author
Amaravati, First Published Oct 6, 2021, 2:29 PM IST

కర్నూలు (kurnool District) జిల్లా ఆత్మకూరు ( atmakur) నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy)కి వినూత్నరీతిలో స్వాగతం పలికారు వైసీపీ నేతలు. బుధవారం ఆత్మకూరులోని ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు దగ్గర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి డ్రోన్ సహాయంతో పూలమాలను అలంకరించి ఘనంగా సత్కరించారు ఏ.ఎస్ పేట జడ్పీటీసీ సభ్యురాలు పందిళ్ళపల్లి రాజేశ్వరమ్మ, ఏ.ఎస్. పేట మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ సంధాని భాష, ఇతర వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, ఆత్మకూరు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి తీరుస్తానని హామీ ఇచ్చారు మంత్రి గౌతమ్ రెడ్డి. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు. 

Also Read:ఏపీ రాజధాని పులివెందుల, విజయవాడ కూడా కావచ్చు...: మంత్రి మేకపాటి సంచలనం

కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy)కి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. తన పని తాను చేసుకుంటూ వివాద రహితుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన గౌతమ్ రెడ్డి.. నెల్లూరు జిల్లా(Nellore district) ఆత్మకూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ (ysrcp)  టికెట్‌పై వరుసగా గెలుపొందారు. ఆయన సమర్థతపై నమ్మకం వుంచిన సీఎం జగన్.. మేకపాటిని (ap cabinet) కేబినెట్‌లోకి తీసుకుని కీలకమైన పరిశ్రమల శాఖను అప్పగించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios